ETV Bharat / bharat

పండుగలు జరుపుకోవడంపై కేంద్రం రూల్స్ - కంటైన్మెంట్ జోన్లు

మరికొన్ని రోజుల్లో పండుగ సీజన్​ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా వైరస్​ వ్యాప్తి జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. కంటైన్మెంట్​ జోన్లలో ఇళ్లలోనే పండుగలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.

containment
కంటైన్మెంట్​ జోన్
author img

By

Published : Oct 6, 2020, 7:58 PM IST

కంటైన్మెంట్ జోన్లలో పండుగ సీజన్​లో కరోనా నియంత్రణకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్లలోనే పండుగలను నిర్వహించుకోవాలని ప్రజలను కోరింది.

పండుగలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కంటైన్మెంట్​ జోన్లకు అవతలనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఆయా కార్యక్రమాల ఏర్పాట్లపై స్థానిక అధికారుల పర్యవేక్షణ ఉండాలని నిర్దేశించింది. థర్మల్ స్క్రీనింగ్​, భౌతిక దూరం, శుభ్రత వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలని సూచించింది.

ఊరేగింపుల్లో..

"ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల్లో పరిమితికి మించి ప్రజలను అనుమతించరాదు. ఇది వీలుపడకపోతే.. కనీసం భౌతిక దూరాన్నైనా పాటించేలా చూడాలి. ఊరేగింపులు ఎక్కువ దూరం ఉన్నట్లయితే ఆంబులెన్సు సేవలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి కార్యక్రమాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రజల భౌతిక దూరాన్ని గమనించాలి." అని మార్గదర్శకాల్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇదీ చూడండి: రష్యా టీకా​పై రెడ్డీస్​కు డీసీజీఐ కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.