మార్చి 31న(నేడు) పదవీ విరమణ చేయనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువు పెంచేది లేదని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
అందరికీ తప్పదు...
కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది కేంద్రం. పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. కొంత మంది కార్యాలయాల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. అయితే 2020 మార్చి 31 నాటికి పదవీ విరమణ చేయాల్సిన వారంతా ఎక్కడున్నా ప్రభుత్వ సేవల నుంచి తప్పుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.