జాతీయ, సాంస్కృతిక వేడుకల సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు మిఠాయిలు పంచుకోవడం సంప్రదాయం. కానీ ఈసారి బక్రీద్‌కు అలాంటిది జరగలేదు. కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో మిఠాయిలు పంచుకునేందుకు పొరుగు దేశం అంగీకరించలేదు.
ఉమ్మడి వేడుకలకు సంబంధించి ఆదివారం అటారి-వాఘా సరిహద్దు వద్ద ఉన్న బీఎస్ఎఫ్ అధికారులు తమ నిర్ణయాన్ని ఇస్లామాబాద్‌కు చేరవేయగా.. పాక్ తిరస్కరించింది. ఇరు దేశ సైనికుల మధ్య ఎలాంటి కార్యక్రమాలు ఉండవని స్పష్టంచేసింది.
చివరిసారి జూన్‌లో రంజాన్ సందర్భంగా ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకున్నారు.
బంగ్లాదేశ్ సైనికులతో...
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బక్రీద్ వేడకలు నిర్వహించారు. ఇరుదేశాల అధికారులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని, మిఠాయిలు పంచుకున్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో 'ఈద్' ప్రశాంతం... కానీ కళ తప్పింది!