బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నేడు దిల్లీకి వెళ్లట్లేదని ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ. ఎగ్జిట్ పోల్స్ అనంతరం దిల్లీలో విపక్షాలతో భేటీ అవుతారని వచ్చిన వార్తలపై ఈమేరకు స్పష్టత ఇచ్చింది బీఎస్పీ.
'దిల్లీలో మాయావతి నేడు ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించట్లేరు. ఆమె లఖ్నవూలోనే ఉంటారు.'
- సతీశ్ చంద్ర మిశ్ర, బీఎస్పీ సీనియర్ నేత
మే 23న లోక్సభ ఫలితాలు రానున్న నేపథ్యంలో.. మాయావతి దిల్లీలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అవుతారని కొన్ని మీడియాల్లో వార్తలొచ్చాయి. ఈ ఊహాగానాలను కల్పితమే అని కొట్టిపారేసింది పార్టీ.
ఎన్నికల తదనంతర పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మాయావతిని లఖ్నవూలో శనివారం ఉదయం కలిశారు.
మే 19తో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి.
ఎన్నికల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే... ప్రభుత్వ ఏర్పాటులో ఎస్పీ-బీఎస్పీ కూటమి కీలక పాత్ర పోషించే అవకాశముంది.
ఇదీ చూడండి: