ETV Bharat / bharat

వైద్య సిబ్బంది భద్రతలో రాజీ పడేది లేదు: మోదీ

వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వైద్యుల రక్షణకు జారీ చేసిన ఆర్డినెన్స్ తప్పక​ భరోసా కల్పిస్తుందన్నారు. కొవిడ్-19 సత్వర స్పందన- ఆరోగ్య వ్యవస్థ పాకేజీ కోసం రూ.15 వేల కోట్ల నిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

VIRUS-ORDINANCE-PM
మోదీ
author img

By

Published : Apr 22, 2020, 7:24 PM IST

వైద్య, ఆరోగ్య సిబ్బంది భద్రత విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వైద్య సిబ్బందిపై దాడులు చేసిన వారిని శిక్షించేందుకే ఆర్డినెన్స్​ తీసుకొచ్చినట్లు చెప్పారు.

మన దేశంలోని వైద్య నిపుణుల భద్రతకు ఈ ఆర్డినెన్స్ భరోసా కల్పిస్తుందని మోదీ అన్నారు. కరోనాపై పోరాడుతున్న ప్రతి ఆరోగ్య కార్యకర్త రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఏడేళ్ల శిక్ష..

అంటువ్యాధుల సవరణ ఆర్డినెన్స్​-2020కు కేంద్ర కేబినెట్​ బుధవారం ఆమోదం తెలిపింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేసినా, వారి బాధ్యతలకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటారు. నిందితులకు చట్టం ప్రకారం ఆరు నెలల నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

సీఎంలతో భేటీ..

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్​డౌన్ పరిస్థితులపై చర్చించనున్నారు. లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి సీఎంలతో పీఎం వీసీ నిర్వహించడం ఇది మూడోసారి.

ప్యాకేజీకి ఆమోదం..

కొవిడ్- 19 అత్యవసర స్పందన, వైద్య వ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీ కింద రూ.15 వేల కోట్ల నిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు దశల్లో ఈ నిధిని ఉపయోగించనుంది ప్రభుత్వం.

సత్వర స్పందన కింద రూ.7,774 కోట్లను ఏడాది నుంచి నాలుగేళ్ల కాలం వరకు మధ్యకాలిక అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు సమీకరణ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అ‌త్యుత్తమ వైద్యవ్యవస్థ ఏర్పాటుకు ఈ నిధిని వెచ్చించనున్నారు.

రాష్ట్రాలకు రూ.3 వేల కోట్లు..

కరోనా తరహా మహమ్మారులపై పరిశోధనకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. ఇప్పటికే ఈ నిధి కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.3 వేల కోట్లు ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు వినియోగించడంపై ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.

ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.