దేశంలో భాజపా, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు అసాధ్యమని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్‌కు ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయిన మరుసటి రోజే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌తో భేటీపై స్పందించిన స్టాలిన్.. ఫెడరల్ ఫ్రంట్ విషయమై సమావేశమవ్వలేదని స్పష్టం చేశారు.
"కూటమి చర్చల విషయమై కేసీఆర్ ఇక్కడికి రాలేదు. ఆలయాలను దర్శించే పనిలో భాగంగానే తమిళనాడుకు ఆయన వచ్చారు. అదే సమయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పరిస్థితులు చూస్తుంటే మూడో కూటమికి అవకాశం లేనట్టే కనిపిస్తోంది. అయినా ఎన్నికల ఫలితాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటాం."
-ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు
ఇదీ చూడండి: కన్నడనాట ఆగని 'సంకీర్ణ కూటమి' యుద్ధం