కర్ణాటక మండ్యలోని వడిరాజ కాఫీ సెంటర్లో పరిస్థితి భిన్నం. అందులోకి వెళ్లగానే 'దయచేసి రాజకీయ విషయాలు మాట్లాడవద్దు. కాఫీ, టీ తాగి క్షేమంగా వెళ్లి రండి' అనే బోర్డు కనిపిస్తుంది. ఇందుకు ఓ పెద్ద కారణమే చెబుతారు హోటల్ యజమాని.
"సుమలత, నిఖిల్ గౌడ అభిమానులు వస్తారు. రాజకీయ చర్చలు మొదలు పెట్టి గొడవలు పడతారు. వాళ్లను ఆపడానికి మేం మధ్యలో వెళ్లాల్సి వస్తుంది.
ప్ర: మరి ప్రస్తుతం వ్యాపారం ఎలా ఉంది?
గొడవల కన్నా ప్రస్తుత వ్యాపారమే బాగుంది."
-వడిరాజ కాఫీ సెంటర్ యజమాని
"హోటల్లో రాజకీయ విషయాలు మాట్లాడరాదన్న నిర్ణయం బాగుంది. చర్చలు పెట్టుకొని గొడవ పడే అవకాశమే లేదు. ఈ నిర్ణయం మాకు ఆమోదమే. ఇప్పుడు అందరూ వచ్చి కాఫీ, టీ తాగి... రాజకీయ విషయాలు మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు."
- వినియోగదారుడు
సుమలత, నిఖిల్ అభిమానులు గొడవపడే స్థాయికి మండ్య రాజకీయం ఎందుకు వెళ్లిందో తెలుసుకునేందుకు ఇవి చూడండి: