రెండో నవకల్పన సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఇందులో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలు ఈ జాబితాలో తుది స్థానాల్ని మూటగట్టుకున్నాయి. సూచీలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, సీఈవో అమితాబ్ కాంత్.. ఈ జాబితాను బుధవారం విడుదల చేశారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల్లో ఆవిష్కరణల బలోపేతానికి అనుసరిస్తున్న విధానాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు.
ఇదీ చూడండి:ప్రముఖ మతబోధకుడి ఇంట్లో ఐటీ సోదాలు