రైల్వేల్లో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంపై కీలక విషయాలు వెల్లడించారు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. ప్రైవేటు రంగం నుంచి రూ. 30 వేల కోట్ల పెట్టుబడి కోసం చూస్తున్నామని స్పష్టం చేశారు.
మొత్తం 151 రైళ్లతో 12 క్లస్టర్లలో 109 రూట్లలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించనున్నట్లు తెలిపారు. భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలతో.. ప్రైవేటు సంస్థలకు ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాల నిర్వహణ అప్పగించడం దేశంలో ఇదే మొదటిసారి అని చెప్పారు కాంత్. ఈ నిర్ణయం.. ప్రయాణికుల రైళ్ల కార్యకలాపాల్లో భారతీయ రైల్వేకు, పెట్టుబడిదారులకు మంచి అవకాశాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ పెట్టుబడులతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైల్వే సాంకేతిక పరిజ్ఞానం.. భారత్లో అందుబాటులోకి వస్తుందని అన్నారు నీతి ఆయోగ్ సీఈఓ.
దరఖాస్తులకు చివరి తేదీ: 2020 అక్టోబర్ 7