రఫేల్ ఒప్పందంలో అవతవకలు జరగలేదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోమారు స్పష్టంచేశారు. విపక్షాలవి కేవలం ఆరోపణలేనని ఏఎన్ఐకు ఇచ్చిన ముఖాముఖిలో విమర్శించారు.
అక్రమంగా పొందారనే ఆరోపణలున్న రఫేల్ పత్రాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అనుమతించినా తమకు ఎలాంటి సమస్య ఉండదని నిర్మల స్పష్టం చేశారు.
"మా పరిస్థితి బలహీనపడిందని నేను అనుకోవట్లేదు. మా వాదన మరింత బలపడింది. ఇలాంటి ముఖ్యమైన పత్రాల్లో ఒక్క పేజీ బయటకు వచ్చినా... నా ప్రకారం అది సమాచారాన్ని దొంగలించడమే. బయటకు వచ్చిన పత్రాలతో మాకు నష్టం జరగదు. మా తరఫున మేము ఎంతో స్పష్టంగా ఉన్నాం. అక్రమంగా పొందిన పత్రాలను కొన్ని వార్తా పత్రికలు ప్రచురించాయి. వాటిని పరిశీలించినా సరైన పద్ధతిలోనే రఫేల్‌ను కొనుగోలు చేసినందున మాకు సమస్య ఉండదు. "
--- నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి.
ఇదీ చూడండి: 'వైమానిక దాడులపై జవాబు చెప్పాల్సింది పాకిస్థానే'