ETV Bharat / bharat

నిర్భయ: నేడు నూతన డెత్​వారెంట్ జారీపై విచారణ - Nirbhaya case news

నిర్భయ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దోషులకు కొత్త డెత్​ వారెంట్ ప్రకటించాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై కోర్టు నేడు విచారణ జరపనుంది. అయితే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దోషుల్లో ఒకరైన వినయ్​శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

'Nirbhaya' parents to court for 'execution
'ఉరిశిక్ష' అమలుకై కోర్టుకు 'నిర్భయ' తల్లిదండ్రులు
author img

By

Published : Feb 12, 2020, 6:05 AM IST

Updated : Mar 1, 2020, 1:17 AM IST

సుప్రీంకోర్టు డెత్​ వారెంట్​ జారీ కోసం కింది కోర్టు వెళ్లవచ్చని తీర్పునిచ్చిన నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం నిర్భయ దోషులకు కొత్త డెత్​ వారెంట్​ జారీ చేయాలంటూ ట్రయల్​ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై నేడు విచారణ జరపనుంది. దోషులు చట్టాలను అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు వ్యాజ్యంలో ఆరోపించారు.

అయితే నిర్భయ హత్యాచారం కేసులో ఉరి శిక్ష తప్పించుకునేందుకు దోషులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్​ శర్మ.. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కూడా తన పిటిషన్‌లో అభ్యర్థించాడు. వినయ్​కు క్షమాభిక్షను ఫిబ్రవరి 1న నిరాకరించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

కేంద్రానికి ఆ స్వేచ్ఛ ఉంది...

ఉరిశిక్షపై స్టే తొలగించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ.. కేంద్రం, దిల్లీ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్​పై అభిప్రాయాలు తెలపాలని నలుగురు దోషులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.

తాజాగా డెత్‌ వారెంట్‌ జారీ కోసం కింది కోర్టుకు వెళ్లేందుకు కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉందని జస్టిస్‌ ఆర్​ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. కేంద్రం, దిల్లీ ప్రభుత్వ పిటిషన్లు తమ వద్ద పెండింగ్‌లో ఉండటం.. కింది కోర్టుకు వెళ్లడానికి అడ్డు ఏమీ కాదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. దోషులకు ఉరిశిక్ష అమలు చేయడం చట్టాన్ని పాటించడం తప్ప.. ఆనందాన్ని అనుభవించడం కాదని అన్నారు.

ఇదీ చూడండి: కేజ్రీవాల్‌ లవ్‌స్టోరీ.. అలా మొదలైంది..!

Intro:Body:

WHO

Conclusion:
Last Updated : Mar 1, 2020, 1:17 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.