ETV Bharat / bharat

నిర్భయ భారతం - మృగాళ్లకు గుణపాఠం - Nirbhaya news of Eenadu

దేశ రాజధాని నడిబొడ్డులో కలకలం రేపిన నిర్భయ అత్యాచార దోషులకు ఎట్టకేలకు ఉరి బిగిసింది. ఈ కేసులో నలుగురు దోషులు ఉరికంబం ఎక్కేలోగా కథ అనేక మలుపులు తిరిగింది. వారి ప్రాణాలు కాపాడుకోవడానికి దోషులు శతవిధాలా విఫలయత్నం చేశారు. శిక్ష అమలుపై ఇన్నాళ్లూ వరుసగా పీటముళ్లు పడిన తీరు ఎందరినో కుపితుల్ని చేసింది. మహిళలపై నేరాలకు తెగబడిన కేసులలో.. నిర్ణీత కాలావధిలో శిక్షల విధింపు, అమలు పూర్తయితేనే నానావిధ దాష్టీకాలతో రెచ్చిపోతున్న మృగాళ్ల గుండెల్లో భీతి పుట్టేది.

Nirbhaya convicts are hanged out in Tihar Jail
నిర్భయ భారతం - మృగాళ్లకు గుణపాఠం
author img

By

Published : Mar 21, 2020, 7:26 AM IST

సుమారు ఏడేళ్లక్రితం దేశంలో మనసున్న ప్రతి తల్లి తండ్రి చేత కంటతడి పెట్టించిన ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు నిన్న తెల్లవారుఝామున తిహార్‌ జైలులో ఉరిశిక్ష అమలైంది. ఆ నలుగురూ ఉరికొయ్యకు వేలాడేలోగా కథ ఎన్నో మలుపులు తిరిగింది. ప్రాణాల్ని కాపాడుకోవడానికి అందుబాటులోని అన్ని అవకాశాలనూ దోషులు వినియోగించుకున్న తరవాతే మరణ దండన అమలుపరచాలని లోగడ ఒక సందర్భంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మాట నిజం. అదే సర్వోన్నత న్యాయస్థానం నిర్భయ దోషుల అప్పీళ్లను 2017లోనే కొట్టేసినా- శిక్ష అమలుపై ఇన్నాళ్లూ వరసగా పీటముళ్లు పడిన తీరు ఎందరినో కుపితుల్ని చేసింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నట్లు- ‘ఉరి అమలును జాప్యం చేసేందుకు దోషులు వ్యూహాత్మకంగా’ వ్యవహరించారు!

సుదీర్ఘ నిరీక్షణాంతరం..

సుదీర్ఘ నిరీక్షణానంతరం నిర్భయకు న్యాయం జరిగిందన్న వాట్సాప్‌ సందేశాలు నిన్న రోజంతా చక్కర్లు కొట్టినా, యావద్దేశం ఉద్విగ్న స్పందనలు రేకెత్తించిన సంచలనాత్మక కేసు తార్కిక ముగింపును చేరుకోవడానికి ఇన్నేళ్లు పట్టడమేమిటన్న ప్రశ్న ఆలోచనాపరుల్ని తొలిచేస్తోంది. క్యురేటివ్‌ పిటిషన్లు, పునస్సమీక్షలు, క్షమాభిక్ష అర్జీల పేరిట విపరీత కాలయాపన వ్యవస్థాగత లొసుగుల పర్యవసానమేననడంపై భిన్నాభిప్రాయానికి తావే లేదు. ఉరిశిక్ష అమలు నిలుపుదల కోరుతూ నిర్భయ దోషులు పెట్టుకున్న అభ్యర్థనల్ని దిల్లీ కోర్టు కడసారి తోసిపుచ్చడానికి కొన్ని గంటలముందు రాజ్యసభ సముఖానికి చేరిన స్థాయీసంఘం నివేదిక, కీలక సంస్కరణల్ని ప్రతిపాదిస్తోంది. మహిళలపై నేరాలకు తెగబడిన కేసులలో బెయిలు అవకాశాన్నే నిరాకరించాలంటున్న పార్లమెంటరీ కమిటీ- నెల తిరగకుండానే అభియోగపత్రం (ఛార్జిషీట్‌) నమోదు కావాలని, ఆరు నెలలలోపు విచారణ ప్రక్రియ ముగిసిపోవాలని అంటోంది. నిర్ణీత కాలావధిలో శిక్షల విధింపు, అమలు పూర్తయితేనే- స్త్రీమూర్తులపై నానావిధ దాష్టీకాలతో రెచ్చిపోతున్న మృగాళ్ల గుండెల్లో భీతి పుట్టేది!

నెరవేరిన నిర్భయ కల..

‘వో లోగోంకో నహీ ఛోడో....’ (వాళ్లను వదలొద్దు)- అత్యంత పాశవిక రాక్షస కాండకు గురై విలవిల్లాడుతూ ‘నిర్భయ’ పంటి బిగువున ఇచ్చిన వాంగ్మూలమది. ఆమె చివరి కోరికను నిజం చేయడంలో పదేపదే అడ్డంకులు ఏర్పడుతుండటంపట్ల దేశ పౌరుల ఆందోళన, అసహనాల్ని గత నెలలో రాజ్యసభాముఖంగా వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. అదే బాణీని అందిపుచ్చుకొన్న స్థాయీసంఘం- సత్వర న్యాయం అందించడంలో వ్యవస్థాగత వైఫల్యంపై న్యాయ హోం మంత్రిత్వ శాఖలు, చట్టాన్ని అమలుపరచే సంస్థలు విభాగాలన్నీ ఆత్మశోధన చేసుకోవాలని పిలుపిచ్చింది! పార్లమెంటరీ కమిటీ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం- 2012లో దేశవ్యాప్తంగా వనితలపై నమోదైన వివిధ కిరాతకాల సంఖ్య 2,44,270. పోనుపోను వ్యవస్థలు రాటుతేలి అఘాయిత్యాల ఉరవడిని కట్టడి చేయాల్సి ఉండగా- 2018లో ఆ రాశి మూడు లక్షల 78 వేలకు పైబడటం దేనికి సంకేతం? దేశంలో చట్టాలు చట్టుబండలవుతున్నాయనే కదా అర్థం?

స్థాయీసంఘం ప్రతిపాదనలు..

లైంగిక హింసోన్మాదానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా దేశంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో స్త్రీ విభాగాలు నెలకొల్పాలని, అఘాయిత్యాల కేసుల నిర్వహణ బాధ్యతను మహిళా అధికారులకు కట్టబెట్టాలని స్థాయీసంఘం తాజాగా ప్రతిపాదిస్తోంది. తెలంగాణ నమూనాలో మహిళల రక్షణకు ‘షీ టీమ్స్‌’ను దేశమంతటా నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ఇటీవలే వెల్లడించింది. అన్ని రకాల అత్యాచార ఘటనలపై దర్యాప్తు, విచారణలు రెండునెలల్లో తెమిలిపోవాలని, అప్పీళ్లపై నిర్ణయమూ ఆరు నెలల్లో వెలువడాలన్న నిబంధనలతో రెండేళ్లనాడు కేంద్రం అత్యవసరాదేశం (ఆర్డినెన్స్‌) జారీ చేయడం తెలిసిందే. వ్యవస్థాగతమై వర్ధిల్లుతున్న కంతల్ని పూడ్చనిదే ఎన్నెన్ని ఆదేశాలు, సిఫార్సులు, ఉత్తర్వులైనా- బూడిదలో పోసిన పన్నీరే!

ఎన్​సీఆర్​బీ నివేదిక..

జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఈ మధ్యే విడుదల చేసిన వివరాల ప్రకారం- దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకొక మహిళపై అఘాయిత్యం చోటు చేసుకుంటోంది. అత్యాచార కేసులలో విచారణ ప్రక్రియ తీరుతెన్నులు నత్తలకే నడకలు నేర్పుతున్నాయి. నేర నిర్ధారణలు చూడబోతే, మూడోవంతులోపు. అమ్మాయిల వెంటపడి వేధించే కేసులలో పోకిరీలకే మూడేళ్లదాకా జైలుశిక్షతోపాటు జరిమానా విధించగల వీలున్న దేశంలో- అత్యాచారాలు ఏటికేడు పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. గాడి తప్పితే దండన తథ్యమన్న బెదురు లేకపోవడమే- నేరగాళ్లు చెలరేగిపోవడానికి, మదోన్మాదంతో మృగాళ్లు రెచ్చిపోతుండటానికి పుణ్యం కట్టుకుంటోంది. అటార్నీ జనరల్‌గా సొలీ సొరాబ్జీ గతంలో హెచ్చరించినట్లు- ‘న్యాయంలో ఆలస్యం, న్యాయ నిరాకరణ మాత్రమే కాదు... చట్టబద్ధ పాలనను ధ్వంసం చేయడం కూడా’. దురదృష్టవశాత్తు, దేశంలో కొన్నేళ్లుగా జరుగుతున్నదే అది.

వ్యవస్థలు ప్రక్షాళనకు కమిటీ సిఫార్సులు..

నిర్భయ’ ఘటన నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్‌ వర్మ కమిటీ, పోలీసు బలగాల పనితీరు మెరుగుదల అత్యవసరమంటూ కీలక సిఫార్సులెన్నింటినో గుదిగుచ్చింది. మహిళలపై నేరాలు అంతకంతకు పెరుగుతున్న కారణంగా దోషులకు మరింత కఠిన శిక్షలు పడాల్సి ఉందని అయిదేళ్ల క్రితం జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు సారథ్యంలోని ధర్మాసనం విలువైన సూచన చేసింది. మరణ శిక్షతో ముడివడిన కేసులలో హైకోర్టు తీర్పును సవాలు చేసే అప్పీళ్ల విచారణకు ఇటీవలే సుప్రీంకోర్టు ఆరు నెలల గరిష్ఠ పరిమితి విధించింది. మహిళల మాన మర్యాదల్ని మంటగలిపే అఘాయిత్యాలు సహా తీవ్ర నేర స్వభావం కలిగిన ఏ కేసులోనూ శిక్షల ఖరారు, అమలుకు సంబంధించి జాప్యం ప్రసక్తే లేని రీతిగా వ్యవస్థల ప్రక్షాళనకు కమిటీలెన్నో సిఫార్సులందించాయి. అవి దస్త్రాలకే పరిమితమైనంతకాలం, దేశంలో నేరగాళ్లకు కోరలు మొలుస్తూనే ఉంటాయి!

ఇదీ చదవండి: నిర్భయ కేసులో మలుపులు- అత్యాచారం నుంచి ఉరి వరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.