నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను ఫిబ్రవరి 11న విచారిస్తామని సుప్రీం తెలిపింది. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇటీవల దిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారిస్తుంది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వాదనల్లో భాగంగా దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నలుగురు దోషులకు నోటీసులు జారీ చేయాలని మెహతా చేసిన అభ్యర్థనను.. ధర్మాసనం తిరస్కరించింది.
ఫిబ్రవరి 11న విచారణలో నోటీసులు ఇచ్చే అవసరాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.