ETV Bharat / bharat

'అంతా అబద్ధం... నిర్భయ దోషి పిచ్చోడేం కాదు' - nirbhaya case vinay sharma petition mental illness

అనారోగ్యంతో బాధపడుతున్న తనకు మెరుగైన వైద్యం అందించాలంటూ నిర్భయ దోషి వినయ్​శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ కోర్టు కొట్టివేసింది. వినయ్​ శర్మ వ్యాజ్యం అవాస్తవాలతో కూడుకున్నదన్న తిహార్ జైలు అధికారుల వాదనతో ఏకీభవించింది.

nirbhaya
'అంతా అబద్ధం... నిర్భయ దోషి పిచ్చోడేం కాదు'
author img

By

Published : Feb 22, 2020, 4:40 PM IST

Updated : Mar 2, 2020, 4:47 AM IST

మెరుగైన వైద్యం పేరుతో ఉరిశిక్షను ఆలస్యం చేసేందుకు నిర్భయ కేసు దోషి వినయ్ శర్మ వేసిన ఎత్తుగడ చిత్తయింది. అతడి వ్యాజ్యాన్ని దిల్లీ కోర్టు కొట్టివేసింది.

వినయ్​ శర్మ మానసిక స్థితి సరిగా లేదన్న వాదన పూర్తిగా అవాస్తమని దిల్లీ కోర్టుకు స్పష్టంచేశారు తిహార్​ జైలు అధికారులు. మెరుగైన వైద్యం అందించాలని వినయ్​ దాఖలు చేసిన పిటిషన్​పై ఈమేరకు కౌంటర్​ దాఖలు చేశారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని కోర్టుకు నివేదించారు.

"దోషి వినయ్​శర్మ వాదనలన్నీ అవాస్తవాలు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించాం. తలకు ఓ గాయమైంది. దానికి చికిత్స అందించాం. వినయ్​శర్మ గాయాలన్నీ కావాలని చేసుకున్నవే. అతడికి ఏ మానసిక వ్యాధి లేదని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశమై అతడికి వైద్య పరీక్షలు అవసరం లేదు. జైలు డాక్టర్లు అతడిని రోజూ పరీక్షిస్తున్నారు."

-తిహార్ జైలు వాదన

తిహార్ జైలు అధికారుల వాదనను దిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వినయ్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఉరిశిక్ష పడినవారిలో ఆ మాత్రం ఆందోళన, కుంగుబాటు సహజమేనని వ్యాఖ్యానించింది. దోషులకు తగిన చికిత్స అందుతోందని స్పష్టంచేసింది.

నిర్భయ కేసు నలుగురు దోషులను మార్చి 3న ఉరి తీయాలని ఇటీవలే డెత్ వారెంట్ జారీ చేసింది దిల్లీ కోర్టు.

ఇదీ చూడండి: నిర్భయ: దిల్లీ కోర్టుకు వినయ్.. వైద్యం కోసం వినతి​

Last Updated : Mar 2, 2020, 4:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.