ETV Bharat / bharat

'ఆరోగ్య సేతు'ను రూపొందించింది ఎవరు?

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఆరోగ్య సేతు' యాప్​ను ఎవరు రూపొందించారనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేకపోవడమే ఇందుకు కారణం.

NIC has no inforamation about Arogyasetu app
'ఆరోగ్య సేతు'ను రూపొందించింది ఎవరు?
author img

By

Published : Oct 28, 2020, 8:22 PM IST

కరోనా వైరస్‌ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రశంసలు పొందిన భారత యాప్‌ 'ఆరోగ్య సేతు' రూపకర్తలు ఎవరు అనేదానిపై సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేకపోవడమే ఇందుకు కారణం. ఆరోగ్య సేతు సృష్టికర్తల గురించి నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) వద్ద ఎలాంటి సమాచారం లేదని సహ చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్‌ఐసీ.. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వెబ్‌సైట్లను, యాప్‌లను రూపొందిస్తుంది. ఆరోగ్య సేతు వెబ్‌సైట్‌లోనూ ఈ యాప్‌ను తయారుచేసింది ఎన్‌ఐసీ అనే ఉంది. అలాంటి ఎన్‌ఐసీ వద్ద యాప్‌ వివరాలేవీ లేకపోవడం గమనార్హం. ఆరోగ్య సేతు యాప్‌ గురించి తెలుసుకునేందుకు ఇటీవల సౌరవ్‌ దాస్‌ అనే వ్యక్తి గతంలో సహ చట్టం ద్వారా ఎన్‌ఐసీకి దరఖాస్తు చేశాడు. అయితే దాని గురించి తమ వద్ద ఎలాంటి వివరాలు లేవని ఎన్‌ఐసీ సమాధానం ఇవ్వడం వల్ల సౌరవ్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఫలితంగా అతడు కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ)కు ఫిర్యాదు చేశాడు.

సౌరవ్‌ ఫిర్యాదును స్వీకరించిన సీఐసీ.. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "మీరు తయారుచేయనప్పుడు ఆరోగ్య సేతుకు gov.in అనే డొమైన్‌ ఎలా వచ్చిందో లిఖిత పూర్వకంగా సమాధానమివ్వాలి" అని ఎన్‌ఐసీని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్‌ఐసీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ, చీఫ్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.