ETV Bharat / bharat

బంగారం స్మగ్లింగ్ కేసులో 20మందిపై ఛార్జ్​షీట్​

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో 20 మందిపై ఎన్​ఐఏ మంగళవారం కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు.

nia, gold smuggling
బంగారం స్మగ్లింగ్ కేసులో 20 మందిపై కేసు నమోదు
author img

By

Published : Jan 5, 2021, 8:56 PM IST

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) 20 మందిపై అభియోగ పత్రం దాఖలు చేసింది. ప్రధాన నిందితులు స్వప్న సురేష్, సరిత్​ సహా 20 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్టు అధికారులు మంగళవారం స్పష్టం చేశారు. స్వప్న సురేష్, సరిత్​లు ఇద్దరూ యూఏఈ కాన్సులేట్​లో మాజీ ఉద్యోగులని, వారు తమ పాత సంబంధాల సాయంతో రాయబార మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్​కు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు.

ఏడాది క్రితం..

గతేడాది జులై 5న తిరువనంతపురం విమానాశ్రయంలో.. యూఏఈ కాన్సులేట్​ కార్యాలయం బ్యాగేజీ నుంచి 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ 21 మంది నిందితులను ఎన్​ఐఏ అరెస్టు చేయగా, 8 మంది పరారీలో ఉన్నారు.

ఇదీ చదవండి : కేరళ ఆటోల్లో పోస్టల్​ శాఖ డిజిటల్​ చెల్లింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.