ETV Bharat / bharat

దిల్లీ పేలుళ్ల కుట్ర కేసులో సూత్రధారి అరెస్టు - isis

దిల్లీలో వరుస పేలుళ్లకు కుట్రపన్నిన మరో ఉగ్రవాదిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. గతేడాదిలో దిల్లీలో పేలుళ్లకు కుట్ర చేసింది ఉగ్రసంస్థ 'హర్కత్​ ఉల్ హర్బ్ ఏ ఇస్లాం'. ఇప్పటికే 12మందిని అరెస్టు చేసిన ఎన్​ఐఏ తాజాగా మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకుంది.

దిల్లీ పేలుళ్ల కుట్ర కేసులో కీలక సూత్రధారి అరెస్టు
author img

By

Published : Apr 21, 2019, 7:39 AM IST

Updated : Apr 21, 2019, 8:45 AM IST

దిల్లీ పేలుళ్ల కుట్ర కేసులో కీలక సూత్రధారి అరెస్టు

గతేడాది దిల్లీలో వరుస పేలుళ్లకు కుట్రపన్నిన వారిలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). అనుమానితుడు ఉత్తర్​ప్రదేశ్​లోని అమోరాకు చెందిన మహమ్మద్ గుర్ఫాన్​గా గుర్తించింది.ఈ కేసులో ఇప్పటికే 12మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది ఎన్​ఐఏ.

దిల్లీ, ఉత్తరప్రదేశ్​​లలో పేలుళ్లకు ఐసిస్​ ప్రేరేపిత ఉగ్రసంస్థ 'హర్కత్​ ఉల్​ హర్బ్​ ఏ ఇస్లాం' ప్రణాళికలు రచించింది. ఈ కుట్ర కీలక సూత్రధారుల్లో గుర్ఫాన్​ ఒకడని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. గుర్ఫాన్​ను దిల్లీ కోర్టులో నేడు ప్రవేశపెట్టనుంది.

నిందితుల నుంచి భారీ మొత్తంలో పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుంది ఎన్​ఐఏ. వీటిలో రాకెట్ లాంచర్లు, అలారం గడియారాలు, 25 కిలోల పేలుడు పదార్థాలు, 91 మొబైల్ ఫోన్లు, 134 సిమ్​ కార్డులు, మూడు లాప్​టాప్​లు ఉన్నాయి.

New Delhi, Apr 20 (ANI): Congress leader and Tourism Minister in the Punjab government, Navjot Singh Sidhu, on Saturday said the Kartarpur Corridor is becoming a reality with equal contribution from both India and Pakistan's governments, and urged that politics should not be played on it. Sidhu added that it takes "two hands to clap" and the Kartarpur Corridor was a result of the mutual symbiosis between India and Pakistan.
Last Updated : Apr 21, 2019, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.