బిహార్ ముజఫర్‌పుర్‌లో 100 మందికి పైగా చిన్నారులు మృతి చెందటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని దుర్భర ప్రజా వైద్య సదుపాయాల పరిస్థితులపై ఆగ్రహించింది. ఇటీవల వ్యాధుల విజృంభనతో సంభవించిన మరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
దేశంలో దీన స్థితిలో ఉన్న ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య సదుపాయాలను పరిశీలించాలని కమిషన్ ప్యానెల్‌లోని వైద్యుల బృందాలను ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. ముందుగా బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలని సూచించింది.
"దేశంలో ఇటీవల సంభవించిన మరణాల నేపథ్యంలో మీడియా నివేదికల ఆధారంగా సుమోటోగా విచారణకు స్వీకరించాం. దేశంలోని చాలా రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలు దుర్భరంగా ఉన్నట్టు వార్తా సంస్థలు పేర్కొన్నాయి."
-ఎన్హెచ్ఆర్సీ ప్యానెల్
ఇదీ చూడండి: 'ముజఫర్‌పూర్ మరణాల'పై విచారణకు సుప్రీం అంగీకారం