ETV Bharat / bharat

అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి: భాజపా - సీటీ రవి తమిళనాడు సీఎం అభ్యర్థి

తమిళనాడులో ఎన్​డీఏ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడీఎంకే నుంచే ఉంటారని భాజపా స్పష్టం చేసింది. పార్లమెంటరీ బోర్డు, ఎన్​డీఏ సమన్వయ కమిటీ కలిసి అభ్యర్థి పేరును నిర్ణయిస్తుందని పేర్కొంది.

Next Tamil Nadu CM will be from AIADMK: Ravi
అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి: భాజపా
author img

By

Published : Dec 31, 2020, 10:48 AM IST

తమిళనాడుకు తర్వాత కాబోయే ముఖ్యమంత్రి విషయంపై భాజపా కీలక వ్యాఖ్యలు చేసింది. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి ఉంటారని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డు, ఎన్​డీఏ సమన్వయ కమిటీ నిర్ణయిస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ఇంఛార్జి సీటీ రవి తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే ఖరారు చేస్తారా అన్న ప్రశ్నకు ఈమేరకు సమాధానం ఇచ్చారు.

"ఎప్పుడైనా సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డే ఎంపిక చేస్తుంది. అభ్యర్థి అన్నాడీఎంకే నుంచే ఉంటారు. ఎవరిని సీఎంగా చేయాలనుకుంటున్నారని వారి(అన్నాడీఎంకే)ను అడిగి తెలుసుకుంటాం. వారే నిర్ణయించుకుంటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలు తమ సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తాయి."

-సీటీ రవి, తమిళనాడు భాజపా ఇంఛార్జి

ఎన్​డీఏలో అన్నాడీఎంకే కీలకమైన భాగస్వామి అని రవి పేర్కొన్నారు. అన్ని విషయాల్లో కేంద్రానికి ఆ పార్టీ మద్దతుగా ఉందని చెప్పారు.

మరోవైపు టీమిండియా మాజీ స్పిన్నర్, క్రికెట్ వ్యాఖ్యాత లక్ష్మణ్ శివరామకృష్ణన్​ను పార్టీలోకి ఆహ్వానించారు సీటీ రవి. తమిళ నటుడు పీఏ సుబ్రహ్మణ్యం సహా పలువురు నేతలు సైతం భాజపా కండువా కప్పుకున్నారు.

ఇదీ చదవండి: దేశంలో 96 శాతానికి కరోనా రికవరీ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.