ETV Bharat / bharat

బస్సులో పుట్టిన శిశువుకు ఆర్టీసీ డిపో పేరు - మహోబా పట్టణం

ఉత్తర్​ప్రదేశ్​లో ఆర్​టీసీ బస్సులో పుట్టిన శిశువుకు ఆమె తల్లిదండ్రులు 'మహోబా డిపో' అని పేరు పెట్టారు. డ్రైవర్, కండక్టర్ చేసిన సాయానికి కృతజ్ఞతగా వారు తమ బిడ్డకు బస్ డిపో పేరు పెట్టినట్లు చెప్పారు.

Newly born
నవజాత శిశువు
author img

By

Published : Sep 30, 2020, 10:44 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మహోబా పట్టణంలో ఆసక్తికర ఘటన జరిగింది. తమ ఇంటిలో కొత్తగా పుట్టిన శిశువుకు బస్ డిపో పేరు పెట్టారు ఆమె తల్లిదండ్రులు.

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని మహోబాలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆర్​టీసీ బస్సులో శిశువుకు జన్మనిచ్చింది ఆ మహిళ. ఆమెకు తోటి మహిళా ప్రయాణికులు సాయం చేశారు.

అనంతరం బస్సు డ్రైవర్​, కండక్టర్​.. తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్​, కండక్టర్​ చేసిన సాయానికి కృతజ్ఞతగా తన కూతురుకు 'మహోబా డిపో' అని పేరు పెట్టినట్లు ఆ మహిళ తెలిపింది.

తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు.. వారిని డిశ్చార్జి చేశారు.

ఇదీ చూడండి: ముంచుకొస్తున్న రోగాలు- సమగ్ర వైద్య సేవలేవీ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.