కర్ణాటక భాజపా నేత, కేబినెట్ మంత్రి సీటీ రవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. ఆదివారం తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు అందించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియామకమైన నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన దిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
భాజపా జాతీయ కార్యవర్గాన్ని ఇటీవలే ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. జాతీయ కార్యవర్గంలోకి సీటీ రవిని తీసుకున్నారు. రామ్ మాధవ్, అనిల్ జైన్, సరోజ్ పాండే వంటి కీలక నేతల పేర్లు అందులో కనిపించకపోవటం గమనార్హం.
ఇదీ చూడండి: బంగాల్పై భాజపా గురి.. రంగంలోకి 'అమిత్ షా'..!