ETV Bharat / bharat

నేడు మధ్యప్రదేశ్​లో​ మంత్రివర్గ విస్తరణ!

author img

By

Published : Apr 21, 2020, 5:26 AM IST

మధ్యప్రదేశ్​లో భాజపా ప్రభుత్వం ఏర్పాటైన సుమారు నెలరోజులకు మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది. కరోనా వైరస్​ వ్యాప్తిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ నేతృత్వంలో కేబినెట్​ విస్తరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

New MP cabinet
నేడే మధ్యప్రదేశ్​ మంత్రివర్గ విస్తరణ!

మధ్యప్రదేశ్​లో రాజకీయ అనిశ్చితి నడుమ భాజపా ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. రాష్ట్రంలో కరోనా వైరస్​ విస్తరిస్తన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​పై విపక్షాలు విమర్శలు చేశాయి. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ సహా ఇతర శాఖల్లో మంత్రులు లేకపోవటంపై అసహనం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నేడు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

" నేడు (మంగళవారం) మధ్యాహ్నం సమయానికి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. అయితే.. తొలి కేబినెట్​ విస్తరణలో కొద్ది మందికే చోటు లభించే అవకాశం ఉంది. "

- పార్టీ వర్గాలు

5-6 మందికి చోటు!

ప్రస్తుతం మంత్రివర్గంలోకి ఎంతమందిని తీసుకుంటారనే అంశంపై స్పష్టత లేదు. నేడు మధ్యాహ్నానికి ఈ సంఖ్యపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చేఅవకాశం ఉంది. అయితే.. 5 నుంచి 6 మందిని కేబినెట్​లోకి తీసుకుంటారని భాజపా వర్గాలు పేర్కొన్నాయి.

28 రోజుల రికార్డ్​..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన నేపథ్యంలో.. మార్చి 23న మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణం చేశారు శివరాజ్​సింగ్​ చౌహాన్​. అయితే.. రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాప్తి, ఇతర కారణాలతో కేబినెట్​ విస్తరణ చేయలేకపోయారు. 28 రోజుల పాటు ఏక సభ్య కేబినెట్​గా కొనసాగిస్తూ.. రికార్డ్​ సృష్టించారు. అంతకుముంది ఈ రికార్డ్​ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప పేరిట ఉంది.

రాష్ట్రపతికి ఫిర్యాదు..

రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవటంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు సోమవారం ఫిర్యాదు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​, వివేక్​ తాంఖ. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.

భాజపాకు కత్తిమీదసామే!

ప్రస్తుతం మంత్రివర్గంలోకి కొద్ది మందిని మాత్రమే తీసుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన జోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేల విషయంలో భాజపాకు కత్తిమీద సామే అని తెలుస్తోంది. కమల్​నాథ్​ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన ఆరుగురు సహా 16 మంది ఎమ్మెల్యేల్లో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మాజీ ఆరోగ్య శాఖ మంత్రి తులసి సిలావత్​ పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఇదీ చూడండి: తండ్రి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.