ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ బిష్ట్ మృతి చెందారు. తండ్రి మరణం తీవ్ర దుఃఖాన్ని నింపినా.. రేపు జరుగునున్న అంత్యక్రియలకు హాజరు కాలేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

పేగు వ్యాధితో బాధపడుతూ ఆనంద్ బిష్ట్ ఈ రోజు ఉదయం 10:40 నిమిషాలకు లఖ్నవూ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి:దొంగతనం చేసిన బాలుడికి జడ్జి సాయం