ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​:  పసిబిడ్డకు 'శానిటైజర్‌'గా నామకరణం

ఉత్తరప్రదేశ్​లోని షహారాన్​పూర్​కు చెందిన ఓ దంపతులు తమకు పుట్టిన నవజాత శిశువుకు వినూత్నంగా పేరు పెట్టారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఓ ఆయుధంగా భావిస్తున్న 'శానిటైజర్​'నే అతడికి నామకరణంగా పెట్టారు.

new born boy in Uttar Pradesh's Saharanpur district has been named 'Sanitizer'
కరోనా సమయంలో పుట్టిన బుడతడికి 'శానిటైజర్‌'గా నామకరణం
author img

By

Published : Apr 14, 2020, 6:27 AM IST

ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆ మహమ్మారిని ఎదిరించి పుట్టిన నవజాత శిశువుకు వినూత్నంగా నామకరణం చేశారు ఓ దంపతులు. ఆ పసివాడికి 'శానిటైజర్' అని పేరుపెట్టారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని షహారాన్‌పూర్‌ జిల్లా విజయ్‌విహార్‌ ప్రాంతానికి చెందిన ఓంవీర్‌సింగ్‌, మోనిక దంపతులు. ఆదివారం గర్భిణిగా ఉన్న మోనికకు నొప్పులు మొదలవగా.. దగ్గరలోని ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న భర్త ఓంవీర్‌.. బుడతడి పేరు 'శానిటైజర్‌'గా నామకరణం చేస్తున్నానని చెప్పగానే అక్కుడున్న నర్సులంతా చిరునవ్వులు చిందించారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్నవేళ పుట్టిన కారణంగా తన కుమారుడికి కరోనాను ఓడించే శక్తి ఉన్నట్టు నమ్ముతున్నానని.. అందుకే శానిటైజర్‌ అని పేరు పెట్టినట్టు చమత్కరించాడు బిడ్డ తండ్రి. బంధువులందరికి ఫోన్‌ చేసి లాక్‌డౌన్‌ ముగిశాక ఘనంగా వేడుక చేద్దామనుకుంటున్నట్లు చెప్పాడు.

new born boy in Uttar Pradesh's Saharanpur district has been named 'Sanitizer'
తల్లీబిడ్డలు

గతంలో ప్రధాని మోదీ జనతాకర్ప్యూ ప్రకటించిన రోజు గోరఖ్‌పూర్‌లో ఓ తల్లికి ఆడబిడ్డ జన్మించగా.. తల్లిదండ్రులు 'కరోనా'గా నామకరణం చేశారు. మరో ఘటనలో లాక్‌డౌన్‌ ప్రకటించిన ఒక వారానికి డియరియా జిల్లాలో మగబిడ్డ జన్మించగా 'లాక్‌డౌన్‌' అని.. రామ్‌పూర్‌ ప్రాంతంలో అపుడే జన్మించిన ఒక మగబిడ్డకు 'కొవిడ్‌' అని పేరు పెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.