ETV Bharat / bharat

మళ్లీ నేపాల్ కవ్వింపులు- సరిహద్దు వెంట క్యాంపులు - Indo Nepal border

భారత సరిహద్దు వెంట కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది పొరుగు దేశం నేపాల్. బిహార్​ పశ్చిమ చంపారన్​ జిల్లా వాల్మీకి నగర్​ వద్దనున్న గండక్ బ్యారెజీ సమీపంలో రెండు క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇటీవల వెనక్కి తగ్గినట్లు కనిపించిన నేపాల్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టడం సరిహద్దు వెంట ఉద్రిక్తతలను పెంచుతోంది.

nepal
సరిహద్దు వెంట రెండు క్యాంపుల ఏర్పాటు
author img

By

Published : Jun 30, 2020, 1:51 PM IST

నేపాల్​ సోమవారం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మీకినగర్ గండక్​రాజ్​ బ్యారేజీకి సమీపంలో సరిహద్దు వెంట రెండు క్యాంప్​లను ఏర్పాటు చేసింది. బ్యారేజ్​ వద్ద ఇప్పటివరకు పోలీసులతో కాపాలా ఏర్పాటుచేసిన నేపాల్.. వచ్చేవారం నుంచి సైన్యాన్ని మోహరించనున్నట్లు తెలుస్తోంది. తుతీబరీ ప్రాంతంలోని సునౌలీ, మహేశ్​పుర్​ వద్ద పెద్దసంఖ్యలో గుడారాలను నెలకొల్పిందని సమాచారం.

చైనా తుపాకులు..

ఇప్పటివరకు కాలం చెల్లిన తుపాకులను వాడుతున్న నేపాల్ సైన్యానికి చైనా అధునాతన తుపాకులను అందించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

స్థానికుల్లో ఆందోళన..

భారత్​- నేపాల్​ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: వెనక్కి తగ్గిన నేపాల్.. క్యాంప్, వాచ్​ టవర్ తొలగింపు

భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.