కేరళలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన అలప్పుజాలో ఏటా అట్టహాసంగా జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ఈ సంవత్సరం రద్దయింది. ఈ పోటీలు ప్రారంభమయ్యాక 67 ఏళ్లలో రద్దు కావడం ఇదే తొలిసారని స్థానిక పాలనాధికారి, రేస్ సొసైటీ ఛైర్మన్ తెలిపారు.
నాటి ప్రధాని పర్యటనతో షురూ..
1952లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కేరళ పర్యటన సందర్భంగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్నేక్ బోట్ రేస్(చుందన్ వాల్లం కాలీ) నిర్వహించింది. అప్పటినుంచి నెహ్రూ ట్రోఫీ పేరుతో ఏటా ఆగస్టు రెండో శనివారం నాడు.. అలప్పుజాలోని పున్నామాడ సరస్సులో ఈ పోటీలను నిర్వహిస్తోంది కేరళ సర్కారు.
ఏమీటీ బోట్ రేస్.?
ఒక్కో టీమ్‌లో 64 లేదా 128 మంది చొప్పున రెండు టీమ్‌లు రేసులో పాల్గొంటాయి. అలప్పుజాలోని పున్నామాడ సరస్సులో నిర్వహించే ఈ పోటీల్లో.. రేసర్లంతా కలిసి తెడ్డు సాయంతో పడవను నడపాల్సి ఉంటుంది. అట్టహాసంగా జరిగే ఈ రేస్‌ను అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు.
ఇదీ చదవండి: సుశాంత్ కేసు పని పట్టే సీబీఐ బృందం ఇదే!