ETV Bharat / bharat

సీఎంపై అత్యాచార ఆరోపణలు- రంగంలోకి మహిళా కమిషన్​

ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​పై ముంబయికి చెందిన ఓ మోడల్​ చేసిన అత్యాచార ఆరోపణలను సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్​. 2013లో నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది.

National Women commission
జాతీయ మహిళా కమిషన్
author img

By

Published : Dec 17, 2020, 8:10 PM IST

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరేన్​ 2013లో తనపై అత్యాచారం చేశారంటూ ముంబయికి చెందిన ఓ మోడల్​ ఆరోపణలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అంశం వైరల్​గా మారింది. మీడియా రిపోర్టులను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్​ రంగంలోకి దిగింది. ఈ మేరకు 2013లో నమోదైన కేసుపై పూర్తి వివరాలు ఇవ్వాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ రేఖా శర్మ.

" ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరేన్​, సురేశ్​ నగ్రే తనపై 2013లో అత్యాచారం చేశారని ముంబయికి చెందిన ఓ మోడల్​ ఆరోపణలు చేసినట్లు వచ్చిన వార్తలను మహిళా కమిషన్​ పరిశీలిస్తోంది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా వెల్లడించటం వల్ల తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆరోపించింది మోడల్​. పోలీసుల భద్రత కోరుతూ మోడల్​ రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఆమె రాసిన అంశాలను పరిశీలిస్తున్నాం. "

- జాతీయ మహిళా కమిషన్​

సామాజిక మాధ్యమాల్లో మోడల్​ పేరిట ఓ లేఖ వైరల్​గా మారిన మరుసటి రోజునే జాతీయ మహిళా కమిషన్​ ఈ మేరకు స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఏడాది జులైలో గొడ్డా ఎంపీ నిశికాంత్​ దుబే ఈ అంశాన్ని లేవనెత్తారు. అత్యాచార కేసును తిరిగి పునర్విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: సాగు చట్టాల ప్రతులను చించేసిన కేజ్రీవాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.