కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. పురుషులు రోజంతా ఇంట్లోనే ఉంటున్న కారణంగా గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. అయినా... మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేసే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొన్న జాతీయ మహిళా కమిషన్... గృహ హింస కేసులపై ఫిర్యాదులకు ప్రత్యేకించి ఓ వాట్సాప్ నంబర్(72177 35372)ను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఈ నంబర్‌కు మెసేజ్ చేయాలని సూచించింది.
-
@NCWIndia have launched a 'WHATSAPP NUMBER' for help & assistance to women experiencing #DomesticViolence at wake of #Covid19Lockdown.
— NCW (@NCWIndia) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Send 🆘WHATSAPP ALERT🚨
📳 7⃣2⃣1⃣7⃣7⃣3⃣5⃣3⃣7⃣2⃣#HelplineSupport#IndiaFightsGenderAbuse#SayNOtoDomesticViolence pic.twitter.com/qhQmJTisZm
">@NCWIndia have launched a 'WHATSAPP NUMBER' for help & assistance to women experiencing #DomesticViolence at wake of #Covid19Lockdown.
— NCW (@NCWIndia) April 10, 2020
Send 🆘WHATSAPP ALERT🚨
📳 7⃣2⃣1⃣7⃣7⃣3⃣5⃣3⃣7⃣2⃣#HelplineSupport#IndiaFightsGenderAbuse#SayNOtoDomesticViolence pic.twitter.com/qhQmJTisZm@NCWIndia have launched a 'WHATSAPP NUMBER' for help & assistance to women experiencing #DomesticViolence at wake of #Covid19Lockdown.
— NCW (@NCWIndia) April 10, 2020
Send 🆘WHATSAPP ALERT🚨
📳 7⃣2⃣1⃣7⃣7⃣3⃣5⃣3⃣7⃣2⃣#HelplineSupport#IndiaFightsGenderAbuse#SayNOtoDomesticViolence pic.twitter.com/qhQmJTisZm
లాక్డౌన్ ముగిసేంత వరకు మాత్రమే ఈ వాట్సాప్ నంబర్ అమల్లో ఉంటుందని తెలిపింది ఎన్సీడబ్ల్యూ. ఇప్పటికే మహిళల కోసం.. #181, #112 నంబర్లు అందుబాటులో ఉన్నాయని గుర్తుచేసింది.
త్వరలోనే ఆన్లైన్ కౌన్సిలింగ్
లాక్డౌన్ సమయంలో గృహహింస ఫిర్యాదుల విషయంలో ఆయా రాష్ట్రాల కమిషన్లు ఎలా వ్యవహరిస్తున్నాయో చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎన్సీడబ్ల్యూ. ఆన్లైన్, ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ అందించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
దేశంలో మార్చి 25న లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ రేఖాశర్మ తెలిపారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు 257 ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇందులో 69 కేసులు గృహహింసకు సంబంధించినవని ఆమె స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ వేళ పెరిగిన గృహ హింస కేసులు