దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో తమ పార్టీ పార్లమెంట్ సభ్యులను దిల్లీకి వెళ్లవద్దని సూచించింది ఎన్సీపీ. ప్రాణాంతక వైరస్ను ఎదుర్కొనేందుకు నియోజకవర్గంలోని ప్రజలకు సాయం చేయాలని తెలిపింది.
"ఎన్సీపీ పార్లమెంట్ సభ్యులారా... దయచేసి లోక్సభ, రాజ్యసభ సమావేశాలకు వెళ్లవద్దు. మీ నియోజకవర్గంలోనే ఉండి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సంస్థలకు సాయం చేయండి."
-శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు ట్వీట్
బంగాల్ ఎంపీలు కూడా..
కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా తమ నియోజకవర్గాలకు తిరిగి రావాలని తన పార్టీ ఎంపీలను తృణమూల్ కాంగ్రెస్ ఆదేశించింది. టీఎంసీ నుంచి లోక్ సభలో 23 మంది, రాజ్యసభలో 13 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదీ చూడండి:ఉత్తర భారతంలో 'జనతా కర్ఫ్యూ' విజయవంతం