ఓటింగ్ రోజున వార్తా పత్రికల్లో పార్టీల ప్రకటనలపై నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. ఇది రానున్న లోక్‌సభ ఎన్నికలప్పుడు సాధ్యం కాకపోవచ్చు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. దీని కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సవరణలు చేయాలి. లోక్‌సభ ఎన్నికలు దగ్గర్లో ఉన్నందున్న ఇది సాధ్యం కాకపోవచ్చు.
ఓటింగ్‌కు 48 గంటల ముందు నుంచే వార్తాపత్రికల్లో పార్టీల ప్రకటనలపై నిషేధం విధించాలని 2016లో ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల చట్టాల్లో మార్పులు చేయాలని ఓ కమిటీ సూచించింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రకటనలపై నిషేధం అమల్లో ఉంది. అయితే ప్రజాపాతినిధ్య చట్టం-1951 లో సెక్షన్ 126 కి సవరణలు చేపట్టి పత్రికలకూ ఈ నిషేధం వర్తింపజేయాలని సూచించింది కమిటీ.