ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో నక్సలైట్లు పేట్రేగిపోయారు. తాంగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిడ్పాల్ గ్రామంలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దుశ్చర్యలో రెండు ట్రాక్టర్లు, ఒక వాటర్ ట్యాంకర్, ఒక కాంక్రీట్ మిక్చర్ మిషన్ దగ్ధమయ్యాయి.
ప్రధానమంత్రి సడక్ యోజన కింద చిడ్పాల్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తగినంత సెక్యూరిటీ లేనందున పనులను చేపట్టవద్దని పోలీసులు ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్ను హెచ్చరించారు. అయినా వినకుండా పనులను కొనసాగించారని.. ఈ క్రమంలోనే మావోయిస్టులు రోడ్డు పనులకు వినియోగిస్తున్న వాహనాలు, యంత్రాన్ని దహనం చేశారని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'పోల్నెట్ 2.0'తో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం