ETV Bharat / bharat

హిందూ మహా సముద్రంలో భారీగా బలగాల మోహరింపు! - చైనా భారత్​

హిందూ మహాసముద్ర ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరిస్తూ.. భారత నౌకాదళం భారీ స్థాయిలో బలగాలను మోహరించినట్టు తెలుస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తరలించినట్టు సమాచారం.

Navy significantly expands deployment in Indian Ocean following border row with China: sources
హిందూ మహా సముద్రంలో భారీగా బలగాల మోహరింపు!
author img

By

Published : Jul 30, 2020, 1:08 PM IST

చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత నౌకాదళం మరింత అప్రమత్తమైంది. పొరుగు దేశానికి గట్టి సందేశం పంపేలా.. హిందూ మహాసముద్ర ప్రాంతం(ఐఓఆర్​) వెంబడి భారీ స్థాయిలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించినట్టు సమాచారం. ఈ మార్పులను చైనాకు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది.

చైనా ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడకుండా దేశ శక్తిని ప్రదర్శించేందుకు భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం కలిసిగట్టుగా కృషిచేస్తున్నాయి. వీటితో పాటు దౌత్య, ఆర్థిక చర్యలతో తూర్పు లద్ధాఖ్​లో చైనా దురాక్రమణను అడ్డుకుంటోంది భారత్​.

జూన్​ 15న గల్వాన్​ లోయ ఘటనతో ఐఓఆర్​లో బలగాలను మోహరించడం మొదలుపెట్టింది నౌకాదళం. దీనితో పాటు నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు కూడా సరిహద్దులో గస్తీ కాస్తున్నాయి.

తాజా పరిణామాలను గుర్తించినప్పటికీ.. చైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, బలగాలను మోహరించలేదని అధికారవర్గాల సమాచారం. దక్షిణ చైనా సముద్రంపై అమెరికాతో నెలకొన్న వివాదం ఇందుకో ఓ కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో భారీ స్థాయిలో యుద్ధ నౌకలను మోహరించింది చైనా.

ఇదీ చూడండి:- యూనిఫామ్​కు మ్యాచింగ్​ మాస్కులు తప్పనిసరి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.