సరిహద్దుల్లో శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు!
భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్ ఆదివారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ చర్చలు స్నేహపూర్వకంగా జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
"ఇరువురు నేతలు వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన సహా సరిహద్దుల్లో శాశ్వత యథాపూర్వ స్థితి పునరుద్ధరణే లక్ష్యంగా చర్చలు జరిపారు. అలాగే భవిష్యత్లో గల్వాన్ ఘర్షణ లాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు."
- అధికార వర్గాలు