కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ ప్రేమ జంట లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ వినూత్న రీతిలో వివాహం చేసుకుంది. స్వయంగా వధూవరులు డ్రమ్స్ వాయిస్తూ 51గంటల పాటు నిర్విరామంగా సంగీత విభావరి నిర్వహించి, ఆ తరువాత వివాహం చేసుకున్నారు.
నాసిక్‌కు చెందిన ప్రముఖ 'ఎంహెచ్ 51 మ్యూజికల్ బ్యాండ్'లో వినేశ్ నాయర్ డ్రమ్మర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా అతనికి మంచి డ్రమ్మర్‌గా గుర్తింపు ఉంది. అతనికి ప్రియాంక క్షత్రియాతో వివాహం కుదిరింది. అయితే కరోనా సంక్షోభం, లాక్డౌన్ నిబంధనల వల్ల తమ వివాహాన్ని కొద్ది మంది అతిథులతో సాధారణంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
మరపురాని వేడుక
ఎంహెచ్ 51 బ్యాండ్ సభ్యులు మాత్రం తమ స్నేహితుడి వివాహ వేడుకను ప్రత్యేకంగా నిలపాలని నిర్ణయించుకున్నారు. నిర్విరామంగా 51 గంటలపాటు అద్భుత రీతిలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సంగీత కార్యక్రమంలో వధూవరులు కూడా స్వయంగా డ్రమ్స్ వాయించారు. ఆ తరువాతే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. వేడుకకు హాజరైన వారందరూ మాస్కులు ధరించి, డ్రమ్స్ పట్టుకుని పాటలు పాడారు.
సంగీత విభావరిలో ప్రముఖ గాయకుడు రాహుల్ అంబేకర్, సంగీతకారుడు-నటుడు గణేష్ జాదవ్ ఆహూతులందరినీ ఆలరించారు. పెళ్లి వేడుకలకు హాజరైన వారు కూడా డ్రమ్స్ వాయిస్తూ వధూవరులకు మరపురాని తీపి జ్ఞాపకాలను అందించారు.
ఇదీ చూడండి: 'ఈ పామే నన్ను కాటేసింది డాక్టర్ గారూ!'