ETV Bharat / bharat

జల వివాదాల పరిష్కారానికి 'జలశక్తి': మోదీ - tamilnadu

అంతర్​రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి భాజపా సర్కారు మెరుగైన కృషిచేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఇందుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు రామనాథపురం బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు మోదీ.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
author img

By

Published : Apr 13, 2019, 5:18 PM IST

నదీ జలాల వివాద పరిష్కారం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్​కు కుటుంబమే పరమావధి అని, ఇన్నేళ్ల కుటుంబ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ది రాచరిక పాలన అని, వారి హయాంలో దేశాభివృద్ధి కుంటుపడిందని తమిళనాడులోని రామనాథపురం బహిరంగ సభలో మోదీ ఆరోపించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"మా మేనిఫెస్టో.. సంకల్ప పత్రంలో నదీ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక స్థానం కల్పించాం. మే 23న మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు 'జలశక్తి' అనే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం. జలాలకు సంబంధించి అనేక అంశాలపై ఈ శాఖ దృష్టి సారిస్తుంది. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటితో పాటు వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: దేశ ప్రగతిని ఓర్వలేని ప్రతిపక్షం : మోదీ

Ayodhya (Uttar Pradesh), Apr 13 (ANI): Ahead of 'Ram Janamostav' or 'Ram Navami', Uttar Pradesh's Ayodhya is all decked up to celebrate the festival. The devotees took a holy dip in Saryu River to mark the celebration. 'Ram Navami' is celebrated to mark the birth anniversary of lord Rama. According to Hindu holy book Ramayana, Ayodhya is the birth place of lord Rama.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.