దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నాగాలాండ్ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. కోహిమా సమీపంలోని దిమాపుర్కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు.
బాధితుడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించిన దిమాపుర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు.. అసోం గువాహటిలోని వైద్య కళాశాల ఆస్పత్రికి వెళ్లాలని సిఫార్సు చేశారు. అక్కడ వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు అసోం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బిశ్వ శర్మ తెలిపారు. అతనికి తబ్లీగీ కార్యక్రమంతో ఎలాంటి సంబంధం లేదని.. గువాహటి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
కోహిమాలోని పలు ప్రాంతాలతో పాటు, బాధితుడి నివాసం, అతను ముందుగా చేరిన ఆస్పత్రి పరిసరాల్లో ఆంక్షలు విధించింది నాగాలాండ్ ప్రభుత్వం.
ఇదీ చూడండి: ఆ రాష్ట్రాలను కరోనా నుంచి కాపాడిన 'పౌర' నిరసనలు!