దక్షిణ ముంబయిలోని డోంగ్రి ప్రాంతంలో 12కిలోల నిషేధిత మత్తు పదార్థాలు, ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారంతో డోంగ్రిలోని హోం లేబొరేటరిలో సోదాలు నిర్వహించిన మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో అధికారులు.. మత్తు పదార్థాలతో పాటు రూ. 2.18 కోట్లు విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న గ్యాంగ్స్టర్ పర్వేజ్ ఖాన్ అలియాస్ చింకూ పథాన్ను అరెస్టు చేశారు. పర్వేజ్ ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు.. 52.2 గ్రాముల మాదకద్రవ్యాలు, 9ఎంఎం తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. థానే జిల్లాలోని పర్వేజ్ అనుచరులు ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అవిభక్త పిల్లులకు శస్త్రచికిత్స సక్సెస్