ముంబయి ఖార్ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం పాక్షికంగా కూలింది. ఖార్ జింఖానా ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో ఉన్న మెట్లదారి ఒక్కసారిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో పదేళ్ల బాలిక మృతిచెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భవనంలోని వారిని ఖాళీ చేయించాయి.