కరోనా కారణంగా ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. టిక్‌టాక్ వీడియోల్లో కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు ఉపయోగించడాన్ని ఎగతాళి చేశాడు. కొద్ది రోజులకే దగ్గు, జర్వం బారిన పడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా... పరీక్షలు చేసి కరోనా సోకినట్లు నిర్ధరించారు వైద్యులు.
ఐసోలేషన్‌లో ఉంచినా..
బాధితుడిని సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ.. అతడు టిక్‌టాక్‌లో వీడియోలు చేయడం ఆపలేదు. విసిగిపోయిన వైద్యులు... మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
వీడియోలో ఏముంది?
ట
టిక్‌టాక్ వీడియోలో ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మాస్కు ధరించకుండా ఉండేవాడు. ఎవరైనా మాస్కు ధరించమని అడిగితే 'వస్త్రం ముక్కను ఎందుకు నమ్ముతారు. దేవుడిపై విశ్వాసం ఉంచండి' అని సమాధానం చెప్పేవాడు. రెండో భాగంలో 'రాక్‌స్టార్' సినిమాలోని ఓ పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ మాస్కును గాల్లో విసిరాడు.
ప్రయాణాలు చేయకపోయినా..
'అతను ప్రయాణాలు చేయకపోయినప్పటికీ కరోనా కేసు నమోదు కావడం జిల్లా ఇదే తొలిసారి. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒక వీడియో చేశాడు. అందులో అతను మాస్కుతో కనిపిస్తూ అతని కోసం ప్రార్థనలు చేయమని ప్రజలను కోరాడు. దీంతో అతన్ని చాలామంది హేళన చేశారు' అని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: పాక్ దుర్నీతికి ముగ్గురు భారతీయులు బలి