ETV Bharat / bharat

పిల్లలను గంగానదిలో పారేసిన తల్లి- అయిదుగురు మృతి - జహంగిరాబాద్

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన అయిదుగురు పిల్లలతో కలిసి గంగానదిలో దూకేసింది. అనంతరం నదిలో నుంచి ఈదుకుంటూ బయటపడగా.. అయిదుగురు చిన్నారులు మృతి చెందారు.

up jahangirabad
ఉత్తర్​ప్రదేశ్ జహంగిరాబాద్
author img

By

Published : Apr 12, 2020, 12:21 PM IST

మాతృత్వపు మాధుర్యాన్ని పంచాల్సిన తల్లి కర్కశంగా వ్యవహరించింది. తన అయిదుగురు పిల్లలతో గంగానదిలో దూకేసింది. అనంతరం ఈదుకుంటూ బయటపడింది తల్లి. అయితే నదిలో మునిగిపోయిన పిల్లలు విగత జీవులుగా తేలారు. ఉత్తర్​ప్రదేశ్​ భదోహీ జిల్లా జహంగిరాబాద్ గంగా ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

నదిలో పిల్లల్ని పారేసినట్లు గ్రామస్థులకు సదరు మహిళ చెప్పటం వల్ల విషయం బయటపడింది. మహిళకు కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

మరణించిన చిన్నారుల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. అందరి వయసు 11ఏళ్ల లోపే ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.