ETV Bharat / bharat

పాత సామాన్ల దుకాణంలో 300 ఆధార్ కార్డులు - కేరళ

కేరళ కట్టాక్కాడలోని ఓ పాతసామాన్లు కొనుగోలు చేసే దుకాణంలో 300లకు పైగా ఆధార్​ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

కేరళ, తిరువనంతపురం
కేరళలో 306 ఆధార్ కార్డలు లభ్యం
author img

By

Published : Jan 25, 2021, 9:47 AM IST

Updated : Jan 25, 2021, 10:02 AM IST

కేరళ తిరువనంతపురం జిల్లాలోని కట్టాక్కాడ ప్రాంతంలో ఓ పాత సామాన్లు కొనుగోలు చేసే దుకాణంలో 306 ఆధార్​ కార్డులు లభ్యమయ్యాయి. ఎన్​వెలప్స్​లో ఉన్న ఆధార్​ కార్డులపై పోస్టల్​ స్టాంపులూ ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధార్​ కార్డులతో పాటు బ్యాంకు, గ్రామపంచాయతీ, ఇంటర్వ్యూలకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయి. ఈ ఘటన ఈనెల 22న వెలుగు చూసింది.

కేరళ, తిరువనంతపురం
స్వాధీనం చేసుకున్న ఆధార్​ కార్డులు

ఎన్​వెలప్స్​తో సహా..

ఈనెల 21న (గురువారం) ఓ వ్యక్తి ఆటోలో దుకాణానికి చేరుకుని వార్త పత్రికలు, ఆధార్ కార్డులు తూకానికి అమ్మాడు. మరుసటి రోజు ఉదయం దుకాణ యజమాని అన్పూ చిత్తుకాగితాలకు తూకం వేస్తున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న న్యూస్​ పేపర్​ ఏజెంట్ ఆధార్​ కార్డులు ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దుకాణానికి చేరుకున్న పోలీసులు పోస్టల్​ సీల్స్​ కలిగిన ఎన్​వెలప్స్​లోని ఆధార్​ కార్డులు, బ్యాంకులు, పంచాయతీ కార్యాలయాల నుంచి వచ్చిన అత్యవసర పోస్టులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : గణతంత్ర దినోత్సవంలో సంజ్ఞల భాష శకటం

Last Updated : Jan 25, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.