ఏప్రిల్లో 7.85 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 64.4 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. దేశంలో 10 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు.
ఈ స్థాయిలో రికవరీ రేటుకు కారణం వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అని భూషణ్ తెలిపారు. 16 రాష్ట్రాల్లో రికవరీ రేటు దేశ సగటు కన్నా ఎక్కువ ఉన్నట్లు భూషణ్ వివరించారు.
రాష్ట్రం | రికవరీ రేటు |
దిల్లీ | 88 శాతం |
లద్దాఖ్ | 80 శాతం |
హరియాణా | 78 శాతం |
అసోం | 76 శాతం |
తెలంగాణ | 74 శాతం |
తమిళనాడు | 73 శాతం |
గుజరాత్ | 73 శాతం |
మధ్యప్రదేశ్ | 69 శాతం |
గోవా | 68 శాతం |
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 52,123 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. కరోనా ధాటికి 34,968 మంది మృతి చెందారు.