ETV Bharat / bharat

చైనాకు షాక్- వందేభారత్ రైళ్ల టెండర్లు రద్దు

author img

By

Published : Aug 22, 2020, 5:01 AM IST

Updated : Aug 22, 2020, 5:19 AM IST

వందేభారత్​ రైళ్ల నిర్మాణ టెండర్లను భారతీయ రైల్వే శాఖ రద్దు చేసింది. చైనాకు చెందిన సంస్థకే ఈ టెండర్​ దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారంలోపు మేకిన్​ ఇండియా నిబంధనలతో మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తామని స్పష్టం చేసింది రైల్వే శాఖ.

RAIL-TRAIN18-TENDER
వందేభారత్

'వందేభారత్' సెమీ హైస్పీడ్​ రైళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ రైల్వే. 44 రైళ్ల నిర్మాణానికి గతేడాది పిలిచిన టెండర్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు ప్రభుత్వం. మేకిన్ ఇండియా నిబంధనలతో వారంలోపు మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తామని తెలిపింది.

ఇప్పటివరకు దాఖలైన బిడ్డర్లలో చైనాకు చెందిన కంపెనీ ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 44 రైళ్ల నిర్మాణానికి గత నెలలో వచ్చిన టెండర్లలో ఒకటి చైనాకు చెందిన జాయింట్ వెంచర్​ కంపెనీ సీఆర్​ఆర్​సీ పయనీర్​ ఎలక్ట్రిక్​ ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం ఆరు టెండర్లు రాగా ఏకైక విదేశీ బిడ్డర్​గా సీఆర్​ఆర్​సీ ఉంది.

చైనా కంపెనీకి దక్కే అవకాశం ఉండటంతో..

గురుగ్రామ్​కు చెందిన పయనీర్ కంపెనీతో చైనాకు చెందిన సీఆర్​ఆర్​సీ యాంగ్జీ ఎలక్ట్రిక్ కంపెనీ 2015లో జాయింట్ వెంచర్ నెలకొల్పింది. వాస్తవానికి 44 వందేభారత్ రైళ్ల నిర్మాణ టెండర్ ఈ చైనా కంపెనీకు దక్కే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. స్వదేశీ సంస్థలకే ప్రాజెక్టు అప్పగించాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వందేభారత్​ రైళ్ల నిర్మాణానికి చెన్నై ఇంటిగ్రల్ కోచ్​ ఫ్యాక్టరీ జులై 10న టెండర్లను ఆహ్వానించింది. ఇందులో మొత్తం ఆరు టెండర్లు దాఖలు కాగా 5 ప్రభుత్వ రంగ సంస్థలవి ఉన్నాయి. సీఆర్​ఆర్​సీ కాకుండా బీహెచ్​ఈఎల్​, భారత్​ ఇండస్ట్రీస్, ఎలక్ట్రోవేవ్స్ ఎలక్ట్రానిక్స్​, మేధా సర్వో డ్రైవ్స్, పవర్ నెటిక్స్ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి.

చైనా ఎదురుదెబ్బ!

భారత్​, చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో డ్రాగన్​ వ్యతిరేక నిర్ణయాలపై భారత్ దృష్టి సారించింది. చైనా యాప్​లపై నిషేధం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి తప్పించటం వంటి చర్యలు చేపట్టింది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆధిపత్య పరుగులో చైనా... ఆయుధ అన్వేషణలో భారత్​

Last Updated : Aug 22, 2020, 5:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.