వర్షాకాలం, తుపానులను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ). బ్రిటన్‌కు చెందిన ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం సహా పలు భారతీయ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో వర్షపాతాన్ని ముందుగానే మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని తేల్చాయి. వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశమై పరిశోధన సాగించాయి.
"ఈ సాంకేతికత వినియోగం ద్వారా ఆసియాకు చెందిన రైతులు పంటలను ఎప్పుడు వేయాలో తెలుస్తుంది. కురవబోయే వర్షపాతం అంచనా ఆధారంగా ఏయే పంటలు వేస్తే అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకునేందుకు అవకాశం ఉంది."
-ఐఐఎస్సీ ప్రకటన
ఐఐఎస్సీలో వాతావరణ, సముద్ర శాస్త్ర విభాగ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పీఎన్ వినయచంద్రన్, యూఏఈ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటర్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసే ఆండ్రూ మాథ్యూస్ నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది.
నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్‌లో 'సముద్ర మిశ్రమ ఉపరితల ఉష్ణోగ్రత పరిశీలన-వాతావరణ మార్పు సమయంలో జరిగే చర్యలు' అనే వ్యాసంలో ఈ అధ్యయన వివరాలను ప్రచురించారు. ఈ పరిశోధనకు భారత భూ పర్యావరణ మంత్రిత్వ శాఖ, బ్రిటన్‌కు చెందిన నేచురల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ కౌన్సిల్ (నెర్క్) నిధులు అందించాయి. కొచ్చి శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం, సీఎస్ఐఆర్, గోవా, విశాఖపట్నం కేంద్రాలు.. సముద్ర సమాచార సేవల సంస్థ ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి.
"సముద్ర మార్పులు, ఉష్ణోగ్రతలు, లవణీయత, వేగం, సముద్ర జలాల్లో రేడియేషన్, ఉపరితల మిశ్రమం, వేడి ఉపరితల ప్రవాహాలను ఆర్వీ సింధుసాధన అనే నౌక ద్వారా 2016లో అంచనా వేశాం. సముద్ర గ్లైడర్లు వంటి ఉపకరణాలతో 11 రోజులపాటు ఈ పరిశోధన సాగించాం."
-పరిశోధనలోని భాగం
ఇదీ చూడండి: రిషీకపూర్‌కు సైకత శిల్పంతో నివాళులు