ETV Bharat / bharat

ఒకరోజు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు

ఉక్కపోత, తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న వేళ నైరుతి రుతుపవనాల ఆగమనం మరో రోజు ఆలస్యం కానున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ 6నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని గతంలో అంచనా వేసింది వాతావరణ విభాగం. అయితే తాజాగా జూన్‌ 7న రుతు పవనాలు రానున్నట్టు వెల్లడించింది.

మరో రోజు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు
author img

By

Published : Jun 5, 2019, 5:45 AM IST

Updated : Jun 5, 2019, 8:20 AM IST

మరో రోజు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని చోట్ల 50డిగ్రీల ఉష్ణోగ్రతను దాటుతూ బెంబేలెత్తిస్తున్నాయి. ఈ తరుణంలో నైరుతి రుతుపవనాల రాక మరో రోజు ఆలస్యమవుతుందని ప్రకటించింది భారత వాతావరణ శాఖ.

జూన్‌ 6నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని గతంలో అంచనావేసిన వాతావరణ విభాగం... తాజాగా 7వ తేదీ వరకు వేచి చూడకతప్పదని వెల్లడించింది.

మరోవైపు... ప్రెవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమేట్.. ఇదే తేదీతో తన అంచనాలను సవరించింది. భూమధ్య రేఖ వద్ద ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల రానున్న 24 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మధ్య బంగాళాఖాతం., మాల్దీవుల మీదుగా రుతుపవనాలు మరింత ముందుకు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.

సముద్రమట్టానికి... 3.1 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ పీఠభూమిపై ఆవరించి ఉన్న ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్‌ అనుకూలత వల్ల రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు అంచనా వేసింది.

Mumbai, May 10 (ANI): The special screening of 'Student of the Year 2' was held in Mumbai. B-town celebrities marked their presence at the event. The star cast of 'SOTY 2' was seen during the event along with producer Karan Johar. Bollywood actors Abhishek Bachchan, Varun Dhawan, Sara Ali Khan, Kartik Aaryan and Aditi Rao Hydari attended the screening. Malaika Arora was seen with her girl gang in the event. 'Student of the Year 2' is hitting the theaters on May 10.
Last Updated : Jun 5, 2019, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.