కర్ణాటక విజయపుర జిల్లాలో మానవతా దృశ్యం కనువిందు చేసింది. జంతువుల్లో ఉన్న దయాగుణాన్ని మరోసారి చాటిచెప్పాయి వానరాలు. పందుల దాడి నుంచి కుక్కపిల్లను కాపాడి.. తమకూ మానవత్వం ఉందని నిరూపించాయి.
తల్లి నుంచి తప్పిపోయిన రెండు కుక్కపిల్లలపై కొన్ని పందులు దాడి చేయడాన్ని గమనించింది ఓ వానరం. పక్కన తల్లి శునకం లేనందున చిన్ని శునకాలకు హాని కలుగుతుందేమోనన్న భయంతో రక్షించేందుకు రంగంలోకి దిగింది. పందుల బారి నుంచి ఏదో విధంగా వాటిని తప్పించింది. అయితే అప్పటికే ఒక కుక్కపిల్ల ప్రాణాలు కోల్పోగా.. మరో పిల్లను తల్లి చెంతకు చేర్చింది.
హనుమంతుడు చేసిన అద్భుతం!
అప్పటివరకు పిల్లల కోసం వెతుకుతున్న తల్లి శునకానికి.. కోతి వద్ద అవి తారసపడ్డాయి. అయితే తల్లి శునకం వానరం వద్దకు వెళ్లడానికి వెనుకడుగు వేసింది. కానీ, కోతి మాత్రం కుక్క పిల్లకు తల్లి ప్రేమను పంచింది. ఇది హనుమంతుడు చేసిన అద్భుతంగా గ్రామస్థులు భావిస్తున్నారు.