ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామపత్రం దాఖలుకు ముహూర్తం ఖరారైంది. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్న మోదీ.. ఈ నెల 26న నామినేషన్ వేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు భారీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సమాచారం.
రెండు రోజుల కార్యక్రమం
ఈ నెల 25న వారణాసికి మోదీ బయలుదేరనున్నారు. అదే రోజు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభమయ్యే రోడ్ షోలో పాల్గొన్న తర్వాత కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం స్థానిక కార్యకర్తలు, మేధావులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఉంటుంది. 26న కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శిస్తారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా వెళ్లి నామపత్రం దాఖలు చేస్తారు. 2014లోనూ మోదీ ఇదే సంప్రదాయాన్ని పాటించారు.
గత ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి స్థానాల నుంచి పోటీ చేశారు మోదీ.
సార్వత్రిక ఏడో దశ ఎన్నికల్లో భాగంగా వారణాసిలో మే 19న పోలింగ్ జరుగుతుంది.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాం'