ETV Bharat / bharat

నేడు జీ7 దేశాల సదస్సు- ప్రత్యేక అతిథిగా మోదీ - అమెరికా

ప్రపంచంపై ఆర్థిక మాంద్యం కోరలు చాచిన వేళ ఫ్రెంచ్‌ తీర ప్రాంత నగరం బియారిట్జ్‌లో జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు.

నేడు జీ7 దేశాల సదస్సు- ప్రత్యేక అతిథిగా మోదీ
author img

By

Published : Aug 25, 2019, 5:10 AM IST

Updated : Sep 28, 2019, 4:28 AM IST

నేడు జీ7 దేశాల సదస్సు- ప్రత్యేక అతిథిగా మోదీ

వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదిపేస్తోన్న వేళ, అనేక సందేహాలు, అపనమ్మకాల మధ్య జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం నేడు జరగనుంది. ఇందుకు ఫ్రెంచ్​ తీర ప్రాంత నగరం బియారిట్జ్​ వేదిక కానుంది.

వాణిజ్య యుద్ధాలు మాంద్యంలోకి నెట్టివేస్తాయని ఒప్పందాలు ఆర్థిక పురోగతికి బాటలు వేస్తాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ జీ 7 దేశాలకు సూచించారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజాలపై పన్నులను ఉపసంహరించకుంటే ఫ్రెంచ్ వైన్‌పై సుంకాలు విధిస్తామని..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​, డొనాల్డ్​ ట్రంప్‌ విందు సమావేశం నిర్వహించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కలిసి రావాలని అమెరికాకు ఈ సందర్భంగా మెక్రాన్‌ సూచించారు.

ప్రపంచంలోని ఏడు సంపన్న దేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, ఇటలీ, కెనడా అధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారందరికీ ఆతిథ్య దేశాధ్యక్షుడు మెక్రాన్‌ విందు ఇచ్చారు.

ప్రత్యేక అతిథిగా...

భారత ‌ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా జీ 7 సమావేశాలకు హాజరవుతున్నారు. మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికా అధ‌్యక్షుడు ట్రంప్‌తో వాణిజ్య సుంకాలపై మోదీ చర్చించే అవకాశముందని సమాచారం. అయితే ఇప్పటికే జీ7 సమావేశాల్లో భాగంగా మోదీతో కశ్మీర్​ అంశంపై చర్చిస్తానని ట్రంప్​ ఇప్పటికే తెలిపారు.

Manama (Bahrain), Aug 25 (ANI): Prime Minister Narendra Modi is on his third leg of the three-nation tour to France, United Arab Emirates (UAE) and Bahrain. PM Modi met King of Bahrain Hamad bin Isa Al Khalifa in country's capital Manama on August 24. PM Modi already rounded up his visits to France and United Arab Emirates (UAE).

Last Updated : Sep 28, 2019, 4:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.