ETV Bharat / bharat

భారత్​-అమెరికా మైత్రిలో నవశకం ఆరంభం - ట్రంప్ మోదీ చర్చలు

భారత్‌, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి. అగ్రరాజ్యాధినేత ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ, వైద్య, ఇంధన రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర, అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చర్చల తర్వాత ఇరువురు నేతలు వెల్లడించారు. అత్యంత కీలకమైన సమగ్ర వాణిజ్య ఒప్పందంపై చర్చల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చామని పేర్కొన్నారు.

Modi-Trump
ట్రంప్ మోదీ
author img

By

Published : Feb 25, 2020, 7:41 PM IST

Updated : Mar 2, 2020, 1:44 PM IST

భారత్​-అమెరికా మైత్రిలో నవశకం ఆరంభం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. పర్యటనలో రెండోరోజు ట్రంప్‌ ప్రధాని మోదీతో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో 3 బిలియన్‌ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు ఖరారు కావడం సహా మూడు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

అవగాహన ఒప్పందాలలో రెండు వైద్య రంగానికి సంబంధించినవి కాగా ఒకటి ఇంధన రంగానికి చెందినది. రక్షణ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి భారత్‌ 24 ఎంహెచ్​-60 రోమియో హెలికాఫ్టర్లు, 6 అపాచీ హెలికాఫ్టర్లను కొనుగోలు చేయనుంది.

వైద్య పరికరాల కొనుగోలు..

రెండు దేశాల ఆరోగ్యశాఖల మధ్య మానసిక వైద్యానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది. సురక్షితమైన వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి భారత్‌కు చెందిన సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌, అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిష్ట్రేషన్‌ మధ్య ఎంఓయూ కుదిరింది.

ఇంధన రంగంలో..

ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఎక్సాన్‌ మోబిల్‌ ఇండియా ఎల్​ఎన్​జీ లిమిటెడ్‌, అమెరికాలోని చార్ట్‌ ఇండస్ట్రీస్‌ మధ్య అవగాహన కుదిరింది.

అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ, ట్రంప్‌... ద్వైపాక్షిక బంధం సరికొత్త శిఖరాలకు చేరిందని పేర్కొన్నారు.

"ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని... నేను, అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించాం. ఈ భాగస్వామ్యానికి సంబంధించి, అన్ని అంశాల్లో సకారాత్మకమైన రీతిలో చర్చించాం. అవి.. రక్షణ, భద్రత, ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంగానీ, సాంకేతిక సహకారం, ప్రపంచ అనుసంధానం, వాణిజ్య బంధం, ప్రజల మధ్య సంబంధాలుగానీ రెండు దేశాల వ్యూహాత్మక సహకారంలో కీలక అంశాలు."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకునేలా అమెరికా నుంచి భారత్‌ 3 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక సైనిక హెలికాఫ్టర్లు కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇందులో.. అపాచీ, ఎంహెచ్‌-60 రోమియో హెలికాఫ్టర్లు ఉండగా.. అవి ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. వీటి ద్వారా సంయుక్త పోరాట శక్తి మరింత పెరుగుతుంది. రెండు దేశాల సైన్యం పరస్పరం శిక్షణ పొందడం సహా ఆపరేట్‌ చేస్తాయి."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇంధన రంగంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు.

"ఇంధనం, సహజవాయు రంగంలో మా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతూ ఉంది. ఇంధనం, సహయవాయువుకు సంబంధించి అమెరికా భారత్‌కు అతిపెద్ద భాగస్వామిగా ఉంది. గత నాలుగేళ్లలో బొగ్గు ఇంధన వ్యాపారం సుమారు 20 బిలియన్‌ డాలర్లుగా ఉంది. సంప్రదాయేతర లేదా అణు ఇంధన రంగంలో మా సహకారం సరికొత్త శిఖరాలకు చేరింది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"భారత్‌ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇంధన అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే భారత్‌లో సహజవాయు పంపిణీ నెట్‌వర్క్‌ను మెరుగుపర్చేందుకు ఎక్సాన్‌ మోబిల్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా అమెరికా భారత్‌కు పెద్దఎత్తున ద్రవరూప సహజవాయువును ఎగుమతి చేసే అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక కార్పొరేషన్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇందులో శాశ్వత సభ్యులను కూడా నియమిస్తాం. భారత్‌, అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా."

-డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

వాణిజ్యం ఒప్పందం ఆలస్యం...

భారత్, అమెరికా వాణిజ్యపరంగా సమాన అవకాశాలకు కట్టుబడి ఉన్నాయని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. త్వరలోనే చట్టపరమైన అవరోధాలను అధిగమించి వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకెళ్తామని పేర్కొన్నారు.

"భారత్‌, అమెరికా మధ్య సుమారు 70 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నాయి. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని నాకు విశ్వాసం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల వాణిజ్య మంత్రుల మధ్య సానుకూల రీతిలో చర్చలు జరిగాయి. వాటికి చట్టరూపునివ్వాలని ఓ అవగాహనకు వచ్చాం. భారీ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపేందుకు కూడా అంగీకారం కుదిరింది. రెండు దేశాలకు మేలు జరిగేలా మంచి నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నాం."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై ప్రధాని మోదీతో చర్చించాం. మా బృందాలు ఇప్పటికే అద్భుత పురోగతి సాధించాయి. సమగ్ర వాణిజ్య అవగాహన కుదరడం సహా... ఒప్పందం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది రెండు దేశాలకు చాలా కీలకమైనది."

-డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

ఎంతోమంది ప్రవాస భారతీయులు తమ ప్రతిభ, కష్టంతో.. అమెరికా అభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారని మోదీ చెప్పారు. అక్కడున్న తమవారి సామాజిక భద్రతకు సంబంధించి రెండు దేశాలకు ఉపయుక్తమైన ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళదామని ట్రంప్‌ సర్కార్‌ను కోరినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: డొనాల్డ్ ట్రంప్​, ముకేశ్ అంబానీ మధ్య ఆసక్తికర చర్చ

Last Updated : Mar 2, 2020, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.