ETV Bharat / bharat

నేడు ప్రజలకు మోదీ 'వీడియో సందేశం'

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు ఈరోజు ఓ ముఖ్యమైన సందేశం ఇవ్వనున్నారు. ఉదయం 9గంటలకు దేశ ప్రజలతో ఓ చిన్న వీడియోను పంచుకోనున్నట్టు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Modi to share video message with people on Friday morning
కరోనాపై పోరులో ప్రజలకు నేడు మోదీ వీడియో సందేశం
author img

By

Published : Apr 3, 2020, 5:21 AM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు పాటించాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు ఓ చిన్న వీడియో సందేశాన్ని.. దేశ ప్రజలతో పంచుకోనున్నట్లు తన ట్విట్టర్​లో వెల్లడించారు.

కరోనా వైరస్​పై పోరులో భాగంగా గురువారం.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య కూడా 50 దాటినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మోదీ ఫోన్​ సంభాషణ..

బ్రిటన్​​​లో వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో.. ఆ దేశ​ యువరాజు చార్లెస్​తో ఫోన్​లో సంభాషించారు ప్రధాని మోదీ. బ్రిటన్​లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైరస్​ కారణంగా బ్రిటన్​లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

మరోవైపు కరోనా బాధితుల చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలు, మందుల అంశంపై జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​తో ఫోన్​లో సంభాషించారు మోదీ. ఇరు దేశాలకు ఎగుమతి, దిగుమతుల మార్గాలపై మెర్కెల్​తో చర్చించారు.

అన్ని రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో..

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రభుత్వ అధికారులతో నేడు సమావేశం కానున్నారు. అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్లు, యంత్రాంగాలతో చర్చలు జరుపుతారు. కరోనాపై ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించడం ఈ భేటీ ముఖ్య అజెండా. మార్చి 27న దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​తో సహా మరో 14 రాష్ట్రాల గవర్నర్లతో ఇదే విధంగా చర్చలు జరిపారు.

ఇదీ చూడండి : దిల్లీలో ఒక్కరోజే 141 కొత్త కేసులు- 2 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.